ప్రజల కోసం పని చేసేవారిని గెలిపించి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తాను చెప్పేమాటలను మేధావులు ఆలోచన చేయాలన్నారు. వెనుకబడిన వారి కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. కానీ దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ అన్నారు. ఈ పథకాన్ని ఒకేసారి అందరికీ అమలు చేయలేకపోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంత లేకపోవచ్చు.. కానీ ఆ నినాదం వస్తే వారిలో ఆత్మవిశ్వాసం రావాలి.. దఫాల వారీగా అయినా సరేనని కంకణం కొట్టుకొని ఇంటికి రూ.10 లక్షలు ఇచ్చేలా దళితబంధు కార్యక్రమాన్ని తీసుకు వచ్చామన్నారు.
ఆడబిడ్డల గోస తీరాలని, దూప తీరాలని మిషన్ భగరీథ ద్వారా శుద్ధమైన మంచినీళ్లు తెచ్చుకున్నాం. కరెంటు బాధను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. ఈ జిల్లాకు చెందిన కరెంటు మంత్రి జగదీశ్‌రెడ్డి, భాస్కర్‌రావు ముందుకువచ్చి దామరచర్లను చూపించడంతో రూ.30వేలకోట్లతో అల్ట్రామెగా పవర్‌ప్లాంట్ రూపుదిద్దుకుంటున్నది. ఈసారి భాస్కర్‌రావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే భాస్కర్‌రావు కోరిన కోర్కెలు నెరవేరుస్తా. అక్కడి నిరుద్యోగులకు పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు వచ్చేలా చేయిస్తా. మంచిపనులు కోసం తపించే.. మంచి నాయకుడు ఎప్పుడు ఉన్నా వారిని గెలిపించే ప్రయత్నం జరగాలి’ అన్నారు.