ఈ రోజు వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. కానీ మొదటి ఇన్నింగ్స్ లోనే విజయం ఎవరిదో ఖరారు అయిపోయిది. మొదట బ్యాటింగ్ చేసిన షకిబుల్ సేన కేవలం 204 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మరోసారి ఈ వరల్డ్ కప్ లో సినియర్ ప్లేయర్ మహాదుల్లా అర్ద సెంచరీ తో రాణించాడు. కాగా పాకిస్తాన్ 205 పరుగుల ఛేదనలో ఓపెనర్ లుగా వచ్చిన అబ్దుల్లా షఫీక్ మరియు జమాన్ లు బంగ్లా బౌలర్లపై పూర్తిగా తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. వరుసగా విఫలమైన ఇమామ్ ఉల్ హాక్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఫఖార్ జమాన్ ఆది నుండి షాట్ లతో చెలరేగాడు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 128 పరుగుల అతి విలువైన మరియు ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో జమాన్ (62) మరియు షఫీక్ (68) లు అర్ద సెంచరీ లను పూర్తి చేసుకున్నారు.
వీరిద్దరూ మొత్తం ఎనిమిది సిక్సులు తో ధనాధన్ స్థాయిలో గేమ్ ను రంజింపచేశారు. విజయానికి మరి కొద్ది దూరంలో ఉండగా తొమ్మిది వికెట్లతో విజయాన్ని అందుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.