కేసీఆర్ సారూ… ఒక్కసారి రాహుల్ తో ముచ్చట్లు పెట్టరాదే…?

-

సారు ఒక్క మారు మీడియా ముందుకు రండి సారూ… గత రెండు మూడు నెలలుగా తెలంగాణాలో కేసీఆర్ ని ఉద్దేశించి కొందరు చేస్తున్న వ్యాఖ్య ఇది. ఆయన కరోనా దేశానికి వచ్చిన మొదట్లో అసెంబ్లీలో మీడియా సమావేశం ఆ తర్వాత పలు మీడియా సమావేశాలు వారానికి ఒకటి రెండు ఏర్పాటు చేసి చాలా సందడి చేసారు. ప్రపంచం మొత్తం కరోనాకు భయపడినా సరే తెలంగాణా ప్రజలు మాత్రం హమారే పాస్ కేసీఆర్ హై అనుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కూడా మై హోనా అంటూ ప్రజలకు హామీ ఇచ్చేసారు.

ప్రధాని గరిటెలు, అన్నం పళ్ళాలు కొట్టమని చెప్పినా, కొవ్వొత్తులు వెలిగించమని చెప్పినా సరే బిజెపి పాలిత సిఎంల కంటే సారు ఎక్కువగా డప్పు కొట్టిన పరిస్థితి మనం చూసాం. రాజకీయంగా కూడా కేసీఆర్ కి ఆ పరిణామాలు బాగా ప్లస్ అయ్యాయి… ఆంధ్రాలో కేసులు తక్కువ ఉన్నాయని హైదరాబాద్ వాసి ఒకరు అంటే… ఎల్లవాయ్… చెప్పొచ్చావు గాని కేసీఆర్ ని మించిన తోపు లేడు, ట్రంప్ కే చేతగానిది మా సిఎం చేసిండు అంటూ చాలా మంది కీర్తించేసారు. అయ్యా జగన్ గారూ కేసీఆర్ ని చూసి నేర్చుకోండి అంటూ కేసీఆర్ మీడియా సమావేశాలు చూసి ఆంధ్రా వాళ్ళు అన్నారు.

కొన్ని పత్రికలూ అదే రేంజ్ లో కేసీఆర్ కి భజన చేయడం మొదలు పెట్టాయి. అలా భజన చేసిన కొన్ని రోజులకే… ఏపీలో ప్రభుత్వం వేల పరిక్షలు చేస్తుంటే తెలంగాణాలో ఎందుకు చేయడం లేదు…? అసలు సమస్య ఎక్కడ ఉంది…? కేసులు ఎందుకు తక్కువ చూపిస్తున్నారు…? అంటూ హైకోర్ట్ పల్లవి అందుకుంది. ముందు ఎంతో హడావుడి చేసిన కేసీఆర్ అండ్ మంత్రుల బృందం ఆ తర్వాత కేసీఆర్ ని సమీక్షల్లో మినహా చూడలేదు జనాలు. చెస్ట్ ఆస్పత్రిలో ఊపిరి ఆడటం లేదు… బాయ్ డాడీ అని ఒక వ్యక్తి చనిపోయినా, గాంధీలో పీపీఈ వ్యర్ధాలు ఉన్నా సరే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు.

అవి కేసీఆర్ స్థాయి కాదు గాని కరోనా సాధారణ డెంగ్యూ కాదు, మహమ్మారి వస్తే బొమ్మే. కేసీఆర్ స్వయంగా చెప్పారు, వచ్చిందంటే అందరిని తగులుకుంటది అని… మరి ఆయన మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అసలు ఒక్క సూచన కూడా అధికారులకు చేయడం లేదు. ప్రజలకు ధైర్యం కల్పించడం లేదు, కరోనా వచ్చింది, ఎం చేస్తాం అన్నట్టే ఆయన వ్యవహార శైలి ఉంది అనే ఆరోపణలు వస్తున్నాయి. అటు ప్రజలు కూడా పాపం కంగారు పడుతున్నారు. మరి ఈ తరుణంలో ఒక్క మారు మీడియా ముందుకు వచ్చి, రాహుల్ తో అయినా రెండు మాటలు మాట్లాడితే బాగుండూ అని పలువురు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version