తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నాం: కేసీఆర్‌

-

బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌ హవానే ఉంటుందన్నారు. ఈ జాతీయ పార్టీల హ‌వా కనిపించదన్నారు. 2024 త‌ర్వాత దేశంలో వ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేనని, ఏకపార్టీ ప్ర‌భుత్వం రాదని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాలను మ‌నం గెలుచుకుంటే బీఆర్ఎస్ త‌డాఖా అప్పుడు ఢిల్లీలో చూపిద్దామన్నారు. తెలంగాణ‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నామన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్త‌వులు.. అనే తేడా లేకుండా అన్ని మ‌తాల ప్ర‌జ‌ల‌ను క‌లుపుకొని పోతున్నామన్నారు.

ప్ర‌తి స్కీంలో అంద‌రూ భాగ‌స్వామ్యం అవుతున్నాం. అన్ని మ‌తాల వారిని స‌మానంగా చూస్తున్నాం. తెలంగాణ క‌ల్చ‌ర్ గంగా జ‌మునా తెహ‌జీబ్. హిందూ, ముస్లింలు అంద‌రూ సోద‌రుల్లా క‌లిసి ఉండి మొత్తం ప్ర‌పంచానికి ఉదాహ‌ర‌ణ‌గా ఉంటున్నాం. ప‌దేండ్ల‌లో ఒక్కసారంటే ఒక్క‌సారి కూడా క‌ర్ఫ్యూ లేదు, క‌ల్లోలం లేదు. బ్ర‌హ్మాండంగా శాంతియుతంగా ముందుకు పోతున్నాం. లా అండ్ ఆర్డ‌ర్ ప‌టిష్టంగా మెయింటెన్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నాం.. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యుల‌ర్ పార్టీ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version