మైనంపల్లి రోహిత్‌ను దిష్టి బొమ్మతో పోల్చిన కేసీఆర్

-

ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి నేతృత్వంలో మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రామాయంపేట‌కు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వ‌చ్చింది.. అది ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్ అని కేసీఆర్ అన్నారు. మెద‌క్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. పద్మాదేవెందర్ రెడ్డికి కాంగ్రెస్ లో నిలబడ్డోనికి ఏమైనా పోలిక ఉన్నదా..?

రామాయంపేట ప్ర‌జ‌లు.. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్ ఏందో చూశారు కాదా..? ఆర్డీవో ఆఫీసు వ‌చ్చిందా..? హ‌రీశ్‌రావు ప్రారంభించిండా..? డిగ్రీ కాలేజీ వ‌చ్చిందా..? ఇవ‌న్నీ వ‌చ్చాయి.. ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి నా బిడ్డ అని ఉట్టిగా చెప్ప‌లేదు. ఆమె అనుకుంటే ప‌నులు ఎలా అవుతున్నాయో మీరు చూస్తున్నారు. హెలికాప్ట‌ర్‌లో వ‌స్తూ మంజీరా న‌ది చూశాను. నీళ్లతో నిండుగా క‌న‌బ‌డుతుంది. గ‌తంలో మంజీరాను ఎండ‌బెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాల్వ‌ల్లో చెట్లు, గ‌డ్డి మొలిచి ఉండే. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. నీళ్లు పారుతున్నాయి. ప‌ద్మా చొర‌వ తీసుకోవ‌డంతో, బ్ర‌హ్మాండంగా బాగు చేసుకున్నాం. ఘ‌ణ‌పురం ఆయ‌క‌ట్టు కింద 40 వేల ఎక‌రాలు పండుతుంది. మీ నెత్తిమీద‌నే కుండ‌లాగా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఉంది. మెద‌క్ హైట్‌లో ఉంది కాబ‌ట్టి సంపూర్ణంగా నీళ్లు తీసుకొచ్చే బాధ్య‌త నాది. ఇప్ప‌టికే చాలా ప్రాంతాల‌కు నీళ్లు వ‌చ్చాయి. రాని ఏరియాకు నీళ్లు తెచ్చి ఇస్తా. న‌ర్సాపూర్ కాల్వ‌లు త‌వ్వుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version