తెలంగాణాలో ఎన్నికల వలన పార్టీల మధ్యన చిచ్చులు రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీ మరియు ఇతర స్థానిక పార్టీలు కేసీఆర్ ను ఓడించాలన్న కసితో రగిలిపోతున్నాయి. అయినా కేసీఆర్ ఎన్నికల్లో గెలవడానికి అవసరం అయిన విధంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను గెలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక తాజాగా నర్సంపేట సభలో మాట్లాడిన కేసీఆర్ వైఎస్ షర్మిలపై తన మాటలతో విరుచుకుపడ్డారు. అంతకు ముందు సమైక్యవాదులు మరియు వారి చెంచాలు ఇక్కడ నిరసన తెలిపితే ప్రజలు అడ్డుకున్న విషయాన్నీ కేసీఆర్ గుర్తు చేశారు. ఇక కేసీఆర్ మాట్లాడుతూ, షర్మిల దానితో పెద్ది సుదర్శన్ పై పగ పట్టినట్లు చెబుతున్నారు, అంతే కాకుండా ఎన్నికల్లో గెలవడానికి షర్మిల డబ్బుల కట్టలు పంపిస్తుందట, మరి షర్మిల పంపించే డబ్బులు కట్టలు గెలవాలా ? లేదా మిషన్ భగీరథ గెలవాలా ? అంటూ ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు.
పక్క రాష్ట్రము వాళ్ళు ఇక్కడకు వచ్చి మిమ్మల్ని ఓడిస్తే మనం ఓడిపోవాలా ? ఉవ్వెత్తున లేచి గెలవాలి అన్నది మీరే ఆలోచించండి అంటూ వారిలో ధైర్యాన్ని నింపారు కేసీఆర్.