చంద్రబాబుని దుమ్ము దులిపిన ..కేసీఆర్

-

బాబు..గల్లీకి ఎక్కువ ..ఢిల్లీకి తక్కువ…నువ్వు సీఎంవి కాదు..చీఫ్ మేనేజర్ మాత్రమే..

ఏపీకి ప్రత్యేక హోదాను తెరాస అడ్డుకుంటుందనే చంద్రబాబు వ్యాఖ్యల్ని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు… నువ్వు నాయకుడివి కాదు, మేనేజర్‌వి మాత్రమే అంటూ.. కేసీఆర్ విమర్శించారు, ప్రత్యేక హోదా సంజీవని కాదంటవ్…ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఆందోళనలు చేస్తున్నావు… నువ్వు పచ్చి స్వార్థపరుడని  అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రతీ విషయానికి తెలంగాణను బూచిగా చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు.  ఏపీకి పత్యేక హోదా ఇవ్వాలని కేశవరావు రాజ్యసభలో కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీ కవిత, జితేందర్ రెడ్డి లోక్‌సభలో ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధానికి నేను లేఖ రాస్తానని కేసీఆర్ ప్రకటించారు.

విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం.. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను ఇరు రాష్ట్రాలకు ఇస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ప్రజాసంక్షేమం మీద దృష్టి లేక, అవినీతి వల్లే చంద్రబాబు.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఇద్దరు ఎంపీలతో నేను తెలంగాణ సాధించి చూపించాను… ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. 25 సీట్లు గెలిపిస్తే చక్రం తిప్పుతానని నీలాగా ఎప్పుడు చెప్పలేదు. రైతు బాధలను తీర్చడం కోసం రైతుబంధు పథకం తెచ్చాం.

దేశం మొత్తం దీన్ని ఫాలో అవుతోంది. పేదల గురించి నీకైమైనా అవగాహన ఉందా..?’ అటూ ఘాటుగా విమర్శించారు.  తెరాస ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని నువ్వు కాపీ కొట్టావంటూ బాబుని నిలదీశారు. ఆయనను మోసేవాళ్లే ఉన్నారు తప్పా..ఆయనకు ప్రజాపాలన గురించి అవగాహన లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version