యాగానికి  సర్వం సిద్థం..

-

తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగానికి  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం స్వయంగా యాగం జరిగే స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు ఎలా జరిగాయో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సోమవారం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి.. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో 200 మంది రుత్వికులు యాగం నిర్వహించనున్నారు.  శృంగేరి పీఠాధిపతులు శిష్య బృందం స్వయాన వారు నిర్వహించే యాగశాలను నిర్మించారు. మూడు యాగశాలలతో పాటు 27  హోమగుండాలను ఏర్పాటు చేశారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌లతో పాటు పలువురు ప్రముఖులకు సైతం  ఆహ్వానం అందింది. అయితే భద్రతా కారణాలతో స్థానికులు, ప్రజలను అనుమతించడం లేదు.  తెలంగాణలో సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండేలా, అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగేలా, బంగారు తెలంగాణ కల సాకారమయ్యేలా దైవానుగ్రహం కోసం కేసీఆర్‌ ఈ యాగం చేస్తున్నట్లు పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news