పాదయాత్ర చేసే ఆలోచనలో ఆ ఇద్దరూ నేతలు.. అది గులాబీ బాస్ వ్యూహమేనా..??

-

తెలంగాణలో ఓటమి తరువాత బిఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతోంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కారు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హస్తం గూటికి చేరుతున్నారు.. దానికి తోడు అధినేత కేసిఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో క్యాడర్లో నిరుత్సాహం ఆవహించింది. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. దీంతో పార్టీని బతికించుకోవాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారట.. పాత ఫార్ములానే కొత్తగా ప్రయోగించాలని చూస్తున్నారు.. ఇంతకీ కెసిఆర్ ప్రయోగించే వ్యూహం ఏంటి..?? దానిపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటో చూద్దాం..

రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓటమిపాలైనప్పటి నుంచి కెసిఆర్ ప్రజల్లోకి రావడం లేదు.. ఒకటి రెండు సందర్భాలలో బయటికి వచ్చినా.. కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితమయ్యారు.. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు నడిపిస్తున్నారు.. అక్కడి నుంచే పార్టీ నేతలకు డైరెక్షన్స్ ఇస్తున్నారు.. కెసిఆర్ ఎప్పుడు బయటకు వస్తారనే చర్చ క్యాడర్ తో పాటు అధికార పార్టీలోనూ జరుగుతోంది.. అయితే కెసిఆర్ మాత్రం తన బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించారట.. వారిద్దరి చేత కాంగ్రెస్ పై మాటల యుద్ధం చేయిస్తున్నారు.. ఇదే సమయంలో
వారి చేత పాదయాత్ర చేయించాలనే ప్లాన్ లో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది..

తెలంగాణను రెండు భాగాలుగా విభజించి.. ఇద్దరు నేతలకు ఒక్కో ప్రాంతాన్ని అప్పగించాలని చూస్తున్నారట.. ఉత్తర తెలంగాణలో కేటీఆర్ ను, దక్షిణ తెలంగాణలో హరీష్ రావును రంగంలోకి దింపి పాదయాత్ర చేయించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. పాదయాత్రలకు సంబంధించిన షెడ్యూల్ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందట. తెలంగాణ అంతటా వీరిద్దరూ చేత పాదయాత్ర చేపించడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని, గ్రామస్థాయి నుంచి పార్టీ పుంజుకుంటుందని గులాబీ బాస్ భావిస్తున్నారని సమాచారం. పాదయాత్ర ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని.. తద్వారా రాబోయే పంచాయతీ ఎన్నికలో సత్తా చాటొచ్చని ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు..

పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వస్తారని సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ చేసిన పాదయాత్రను ప్రజలు ఆదరించారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు దగ్గరయ్యారు. తద్వారా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. ఆ తరువాత చంద్రబాబు సైతం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.. ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర సైతం సంచలనంగా మారింది.. పాదయాత్ర ద్వారానే ఆయన 151 యొక్క స్థానాలను గెలుచుకుని 2019లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు.. గత ఎన్నికలకు ముందు లోకేష్ చేసిన పాదయాత్ర కూడా.. టిడిపి గెలుపుకు ప్లస్ అయ్యింది.. అలాగే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. ఇలా నేతలు చేసిన పాదయాత్రలే కష్టకాలంలో ఉన్న పార్టీకి ఊపిరి పోసాయి.. ఇదే స్టేటజి ని కెసిఆర్ ఫాలో అవుతున్నారట.. వారిద్దరి చేత పాదయాత్రలు చేయించి పార్టీకి మైలేజ్ తీసుకురావాలని చూస్తున్నారు.. ఆయన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news