మొన్నటి దాకా కాస్త ఆచితూచి అడుగులేసినట్టు కనపడిన షర్మిల.. ఇప్పుడు రూటు మార్చి సెల్ఫ్ ప్రచారానికి తెరలేపారు. ఏకంగా కేసీఆర్ మీదే తన ఎఫెక్ట్ పడిందంటూ డబ్బా కొట్టుకోవడం మొదలెట్టేశారు. దీంతో ఆమెను నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. మరీ ఇంత అవసరమా అంటూ ఏకి పారేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.
షర్మిల పార్టీ పెట్టక ముందు ఓ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ దాన్ని చేపట్టానని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ఇప్పుడు 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో దీన్ని కాస్తా తన ఖాతాలో వేసుకునేందుకు షర్మిల ప్లాన్ వేశారు.
తన దీక్ష వల్లే కేసీఆర్ దిగొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్స్ జారీ చేయడానికి ఆదేశాలు ఇచ్చారంటూ ట్విట్టర్‌లో పోస్టులు పోడుతున్నారు. ఈరోజు కేసీఆర్‌లో మార్పు తెచ్చింది తన పార్టీయేనంటూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కాస్త విపరీతంగా ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. సీఎం కేసీఆర్ ఎన్ని దీక్షలు, నిరసనలు చేసినా కనీసం స్పందించడని, కానీ ఒక్క దీక్షకే దిగొచ్చాడనం సొంత డబ్బాయే అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.