వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తెగా తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టిన వైఎస్ షర్మిల (sharmila) వ్యూహం ప్రకారం తన అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఆయన జయంతి రోజు జులై8న పార్టీని ప్రకటిస్తానని చెప్పిన షర్మిల అందుకోసం పక్కాగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఆమె.
ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న షర్మిల 8న అక్కడి నుంచి బయటలు దేరుతుంది. ఇక ఆరోజు ఆమె మూడు రాష్ట్రాల్లో తిరగాల్సి ఉంటుంది. బెంగులూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా తమ సొంత జిల్లా కడప జిల్లాలోని వైఎస్సార్ సమాధి దగ్గర నివాళి అర్పించి తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు.
అక్కడ ఉదయం ఎనిమిదిన్నర గంటల తర్వాత ప్రార్థనలు ముగించుకుని అదే జిల్లాలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక చాపర్ ఫ్లైట్‌లో బేగంపేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత డైరెక్టుగా సాయంత్రం 4గంటలకు ఫిలిం సిటీలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్తారు. సరిగ్గా సాయంత్రం 5గంటలకు తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరును, గుర్తును, రంగును ప్రకటిస్తారు.