38 దేశాలకు పాకిన ఓమిక్రాన్ వేరియంట్…

-

ప్రపంచాన్ని ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వైరస్ రూపాంతరం తక్కువ వ్యవధిలోనే ప్రపంచానికి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 38 దేశాలకు ఓమిక్రాన్ వైరస్ వ్యాపించింది. నవంబర్ 24న మొదటిసారిగా ఓమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో బయటపడింది. ఈ తరువాత నుంచి బోట్స్వాానా, నమీబియా దేశాలకు అక్కడ నుంచి ప్రపంచానికి ఓమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. తాజాగా దేశంలోని బెంగళూర్ లో ఇటీవల 2 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో.. ఓమిక్రాన్ దేశాల జాబితాలో ఇండియా కూడా చేరింది.

కాగా ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పరిస్థితుల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ బూస్టర్ డోసు వేయాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నాయి. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, హాంకాంగ్, కెనడా, యూఎస్ఏ, సౌదీ, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, పాకిస్థాన్, చెక్ రిపబ్లిక్, నార్వే, ఫిన్లాండ్, యూకే, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఆస్ట్రియా, ఇజ్రాయిల్, నైజీరియా, ఘనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, గ్రీస్, బ్రెజిల్ దేశాలతో పాటు మరికొన్నిదేశాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version