ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన : ఎమ్మెల్సీ కవిత

-

 బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలకు డోకా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ లో పర్యటించిన కవిత జాబ్ మేళా నిర్వహించారు. అనంతరం పద్మశాలీ ఆత్మీయ సమ్మేలనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్  నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం అవుతుందని అన్నారు. చేనేత మీద ప్రధాని మోడీ పన్ను వేశారని తెలిపారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు వస్తుందని చెప్పారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన చేస్తున్నరన్నారు.చేనేత పరిశ్రమను గత ప్రభుత్వాలు పట్టిచుకోలేదన్నారు.జాబ్ మేళాలో మాట్లాడుతూ.. జాబ్‌మేళాలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కవిత అన్నారు.  గ్రామీణ యువతకు ఇది గొప్ప అవకాశమని చెప్పారు. ప్రతి నెలా ఇలాంటి జాబ్‌ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఎన్నో విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయన్నారు ఎమ్మెల్యే గణేష్ గుప్త. 

 

Read more RELATED
Recommended to you

Latest news