దేశంలోని ప్రముఖ ఆలయాల్లో కేదార్‌నాథ్ ఆలయం ప్రత్యేకమైనది. ఈ ఆలయం సంవత్సరంలో చాలాకాలం పాటూ… మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో… భయంకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి… ఆలయాన్ని ముూసివేస్తారు. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు సాధారణం కావడంతో… ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం తెరచుకున్నది. ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరచుకోవడంతో భక్తులు పులకించిపోయారు.
ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఆరు నెలల తర్వాత తెరచుకున్న కేదారేశ్వరుని ఆలయానికి ప్రత్యేకత ఉన్నది. ఈ ఆలయం ఏడాదిలో చాలాకాలం పాటూ మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో.. భయంకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి క్షేత్రాన్ని ముసివేస్తారు. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు సాధారణం కావడంతో ఉదయం 6.26 గంటలకు ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు.