చూసుకొని మురవాలి…చెప్పుకొని ఏడ్వాలి : కవితకు రేవంత్ కౌంటర్

-

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత సెటైర్లు పేల్చారు.

అయితే కవిత కౌంటర్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. “చూసుకొని మురవాలి…చెప్పుకొని ఏడ్వాలి…” అంటూ కవిత ఫైర్ అయ్యారు. అలాగే కవిత చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేశాడు రేవంత్ రెడ్డి.

కవిత గారు రాహుల్గాంధీని ప్రకటించే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు.. ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మిర్చి రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు అని నిలదీశారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news