కీర్తి సురేష్ జాతకం మారదా…?

-

మహానటి ఇమేజ్‌ కీర్తిసురేష్‌ చెడగొట్టుకుంటోందా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.మహానటి తర్వాత కీర్తిసురేష్‌ నుంచి అదిరిపోయే రోల్స్ ‌వస్తాయని అభిమానులే కాదు కాదు అందరూ ఆశించారు. కానీ సరైన కథలు ఎంచుకోలేకపోయిన కీర్తి రాంగ్‌ స్టెప్స్‌ వేసింది. కీర్తిని జాతీయ ఉత్తమ నటి చేసిన మహానటి తర్వాత సర్కార్‌ మినహా అన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో కీర్తి పై కొత్త చర్చ మొదలైంది.

మహానటి తర్వాత కీర్తి నటించిన పెంగ్విన్‌ మూవీ లాక్‌డౌన్‌ టైంలో ఓటీటీలో వచ్చినా అది అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. మరో మూవీ మిస్‌ ఇండియా రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయితే.. నెగిటివ్‌ రివ్యూసే వచ్చాయి. కథలు ఎంచుకోవడంలో కీర్తి రాంగ్‌ స్టెప్స్‌ వేసింది. మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ‘గుడ్‌ లక్‌ సఖి’ టీజర్‌ కూడా ఆకట్టుకో లేకపోయింది. అన్నాత్తైలో రజనీకాంత్‌తో.. వేదళం రీమేక్‌లో చిరంజీవి చెల్లిగా.. సర్కారువారి పాటలో మహేశ్‌తో జోడీ కట్టిన ఈ అమ్మడు ఈ సినిమాలు పూర్తి తెరమీద కనిపించాలంటే ఇంకా సంవత్సరం పట్టేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news