దుబ్బాక ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్ లు..బీజేపీ పై మూడు రెట్లు…!

-

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది.నవంబర్ 10న కౌంటింగ్ జరగనుంది .ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినప్పటి నుంచి దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు ప్రారంభం అయ్యాయి. బెట్టింగ్ రాయుళ్లు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ పై ఆరా తీసి మరీ రంగంలోకి దిగారు. ఉప ఎన్నిక పోరు టిఆర్ఎస్ బిజేపి మద్య అన్న అంచనాకు వచ్చారు బెట్టింగ్ రాయుళ్ళు. టిఆర్ఎస్ గెలుపుతో పాటు మెజార్టీ …మరోవైపు బిజేపి గెలుపుపై కూడా జోరుగా బెట్టింగ్ నడుపుతున్నారు.

కొందరు టిఆర్ఎస్ గెలుపు మెజార్టీపై బెట్టింగ్ కాస్తే మరి కొందరు అతి తక్కువ మెజార్టీతో బిజేపిపై బెట్టింగ్ కు ముందుకు వస్తున్నారు .అధికార టిఆర్ఎస్ పార్టీ గెలుపుపై ధీమాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు …మెజార్టీ పై బెట్టింగ్ కాస్తున్నారు.టిఆర్ఎస్ పార్టీ 8వేల నుంచి 48 వేల వరకు మెజార్టీతో బుకీలు బెట్టింగ్ వేస్తున్నారు .టిఆర్ఎస్ మెజార్టీ 25 వేలు ఉంటుందన్న దానిపై కూడా బెట్టింగ్ లు నడుస్తున్నాయి.మొదట్లో టిఆర్ఎస్ కి 50 వేల మెజార్టీ వస్తుందా రాదా అన్నఅంశంపై మొదలైన బెట్టింగ్ …ఓటింగ్ స్టార్ అయిన తర్వాత 45 వేలకు పడిపోయింది.పోలింగ్ ముగిసిన తర్వాత ఆ మెజార్టీ 38 వేల వరకు బుకీలు తీసుకువచ్చారు .

ఇటు టిఆర్ఎస్ ,బిజేపి మద్య హోరాహోరిగా ఉప ఎన్నిక జరిగిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరిగింది.దీంతో బిజేపి గెలుస్తుందన్న ధీమాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు …ఈ పార్టీ గెలుపుపై బెట్టింగ్ కాస్తున్నారు .కనీసం 5 వేల నుంచి 10 వేల మెజార్టీపై బెట్టింగ్ నడుస్తోంది .బిజేపి విశ్షేషణలు ,విశ్వాసం చూసిన తర్వాత బిజేపి పై మూడు రెట్లు బెట్టింగ్ ఇప్పుడు నడుస్తోంది .అంటే బిజేపి గెలిచే పరిస్థితిలో రూపాయికి …మూడు రుపాయలు ఇచ్చేందుకు బుకీలు రెడీ అంటున్నారు .

కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి డిపాజిట్ దక్కుతాయా లేదా అన్నదానిపై కూడా బెట్టింగ్ లు సాగుతున్నాయి.ఇటు దుబ్బాక ఉప ఎన్నికలో పోటి చేసిన కత్తి కార్తీకకు వెయ్యి ఓట్లు వస్తాయా రావా అన్నదానిపై కూడా బెట్టింగ్ లు నడుస్తున్నాయి.భీమవరం కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ వ్యవహరాల్లో ఈసారి జోరుగా తెలంగాణకు చెందిన కొందరు నాయకులు ,కార్యకర్తలు డబ్బులు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది .

Read more RELATED
Recommended to you

Latest news