KEERTHY SURESH : ‘సర్కారు వారి పాట’ నుంచి కీర్తి సురేష్ స్టైలిష్ లుక్

-

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్… గ్లామరస్ లుక్ ను వదిలింది చిత్రబృందం. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఈ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. డైనిమ్ జాకెట్, రంగురంగుల టాప్ ధరించిన కీర్తి సురేష్ ను చూడడానికి చాలా అందంగా మరియు స్టైలిష్ గా ఉంది. యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ తాజా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా సర్కారు వారి పాట సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news