‘నువ్వు మహానటివా అంటూ హేళన చేశారు..’ కీర్తి సురేష్..

-

తెలుగు నటీమణుల్లో అగ్ర స్థానంలో నిలిచిన మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న మహానటి సినిమా… తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటనకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాపై స్పందించిన హీరోయిన్ కీర్తి సురేష్ ఈ పాత్ర గురించి బయటకు తెలిసిన తర్వాత తాను ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ కనిపించనుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న కీర్తి సురేష్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకు వచ్చింది..

తాజాగా దసరా సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కీర్తి సురేష్ మహానటి సినిమా కోసం పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఆ సమయంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.. “మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు తనను సంప్రదించినప్పుడు మొదట వద్దనే చెప్పాను కానీ దర్శకుడు నాగస్విన్ పట్టుబట్టి నాపై నమ్మకాన్ని ఉంచి నువ్వు సినిమా చేయగలవని ధైర్యాన్ని ఇచ్చారు. నన్ను అతను అంతగా నమ్ముతున్నారు నాపై నేను ఎందుకు నమ్మకం ఉంచుకోకూడదని భావించాను. అందుకే మహానటి సినిమా చేశాను. అయితే సినిమా ప్రమోషన్స్లో చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ చూసి ఒకానొక పరిస్థితిలో షాక్ అయ్యా. నువ్వు మహానటివా ఎలా సరిపోతావు అంటూ ఎందరో కామెంట్స్ చేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత వాటిని సమాధానం లభించినట్లు అయింది..” అన్నారు.

‘Mahanati’ review : Nag Ashwin’s Savitri biopic rests on the able ...

అలాగే “సావిత్రి గారికి టాలీవుడ్ లో ఉన్న ఆదరణ కారణంగా నేను ఆ పాత్రను చేస్తానంటూ ప్రకటన వచ్చిన వెంటనే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ పాత్రను ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పూర్తిగా ఆ పాత్రలో లీనమవ్వటానికి సావిత్రమ్మ కూతురుతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మహానటి సినిమాలో నటించే సమయంలో నటించిన తర్వాత ఎదురయ్యే సవాల్లను విమర్శలను ముందుగానే కొంత మేర ఊహించగలిగాను. అయినా కూడా దర్శకుడు.. ఇతర యూనిట్ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో మహానటి సినిమాను చేశాను..” అంటూ చెప్పుకొచ్చారు కీర్తి సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news