Keerthy Suresh: మ‌హాన‌టిలో ఈ క‌ళ కూడా ఉందా?

-

Keerthy Suresh: నేను లోకల్ సినిమా తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తిసురేష్. తొలి సినిమాలోనే త‌న అందం, అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత అలనాటి న‌టి సావిత్ర బ‌యోపిక్ ఆధారంగా తెర‌కెక్కించిన‌ ‘మహానటి’ సినిమాలో సావిత్రిగా నటించి, మెప్పించింది. విమ‌ర్శ‌లకు ప్రశంసలు పొందింది. ప్రస్తుతం కీర్తి తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా..? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టివ‌రకు హీరోయిన్‌గా త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్న ఈ న‌టి త‌న‌లోని వ‌యోలినిస్ట్ ను కూడా ప్రేక్ష‌కుల‌కు చూపించ‌బోతుంది. ఈ సినిమా కోసం వ‌యోలినిస్టుగా అవ‌తార‌మెత్తింది.

ప్ర‌స్తుతం వయోలిన్ చేత ప‌ట్టుకొన్న కీర్తి సురేశ్ ప‌ట్టుకున్న ఫోటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
మ‌హేశ్ బాబు సినిమా కోసం.. కీర్తిసురేశ్ మ్యూజిక‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతుంద‌ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. కీర్తిసురేశ్ ఇందులో పాట మాత్రం పాడ‌టం లేదని, వ‌యోలిన్ వాయించ‌డం మాత్రం ప‌క్కా అని చెప్పాడు థ‌మ‌న్. గ‌తంలో ప‌లు మార్లు.. కీర్తి సురేశ్‌కు వ‌యోలిన్ వాయించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. స‌ర్కార్ వారి పాట‌ సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌లో కీర్తిసురేశ్ మ్యూజికల్ టాలెంట్‌ను చూపించ‌బోతున్నార‌ని, త్వ‌ర‌లోనే ఆ బిట్ రిలీజ‌వుతుంద‌ని టాక్. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news