తెలంగాణలో మరో దారుణం.. ప్రియురాలిపై 18 సార్లు కత్తితో ప్రియుడి దాడి

మనదేశంలో మహిళలపై దాడులు ఏ మాత్రం తగ్గటం లేదు. ఏదో ఒక కారణంతో మహిళలపై కొంతమంది దుర్మార్గులు దాడులు చేస్తున్నారు. కొంతమంది లైంగిక దాడి చేస్తుంటే.. మరి కొంతమంది దుర్మార్గులు… మహిళలను విచక్షణారహితంగా నరికి చంపేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో… మరొకటి చోటు చేసుకుంది.

crime

హైదరాబాద్ ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోనీ… హస్తినాపురంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి నిరాకరించిందని కోపంతో యువతి ఇంటికి వెళ్లి ఆమెపై… కత్తితో 18 సార్లు యువకుడు దాడి చేశాడు. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ దాడి ఘటన తెలియగానే స్థానికులు ఆ యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక అటు దాడి చేసిన నిందితుని పోలీసులకు పట్టించారు స్థానికులు.

కాగా… నిన్న పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం.. అచ్చం ఇలాగే ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలి పై కత్తితో దాడి చేశాడు. ఎవరూ లేని సమయంలో కత్తితో దాడి చేసి ఉండడంతో.. ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే హైదరాబాదులో ఈ దారుణానికి ఒడిగట్టాడు మరో ప్రేమోన్మాది.