సీఎం కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు యత్నం…

-

సాక్షాత్తు ఢిల్లీ సీఎం కూతురిని త్వరలోనే కిడ్నాప్ చేస్తామని పేర్కొంటు సీఎం కార్యాలయానికే ఇ- మెయిల్ రావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి, ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ కుమార్తె హర్షితను అపహరిస్తామంటూ… ఈ నెల 9న ఇ – మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌కు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. దీంతో ఈ బెదిరింపుల నిమిత్తం ఆమెకు ప్రత్యేక రక్షణ అధికారిని నియమించారు. అయితే మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్‌ సెల్‌కు  అప్పగించి పూర్తి స్థాయి దర్యాప్తుని చేపడుతున్నారు. ఢిల్లీ మహిళా పోలీస్‌ కమిషన్‌ (డిసిడబ్య్లూ)… ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబానికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని పోలీసులను కోరింది.

ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు బహిరంగంగానే బెదిరింపులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి అధికారికే ఈ పరిస్థితి ఉందంటే…ఇక సామాన్యుల పరిస్థితేంటని సర్వత్రా చర్చనీయాంశ మైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version