ప్రపంచంలోనే అతి పెద్ద దోశ వేసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు..!

-

షాకయ్యారా? అవును.. మీరు చదివింది నిజమే.. అది ప్రపంచంలోనే అతి పెద్ద దోశ. 100 అడుగుల దోశ ఇది. అంత పెద్ద దోశ వేసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు ప్రముఖ చెఫ్ వినోద్ కుమార్. ఆయన…60 మంది చెఫ్ లతో కలిసి ఈ రికార్డు క్రియేట్ చేశాడు. చెన్నైలోని శర్వణా భవన్ కు చెందిన చెఫ్ లే వీళ్లంతా. ఐఐటీ మద్రాసు క్యాంపస్ లో ఈ దోశను తయారు చేశారు. ఈ దోశ కోసం ప్రత్యేకంగా 105 అడుగుల పొడవైన పెనం ఉపయోగించారు. 37.5 కిలోల మినప పిండి, 10 కిలోల బియ్యం పిండి కలిపిన మిశ్రమంతోనే ఈ దోశను తయారు చేశారు. దీంతో గిన్నిస్ రికార్డును సృష్టించారు. దోశ తయారుకాగానే అక్కడికి వచ్చిన వాళ్లందరికీ ఆ దోశను తినిపించారు. ఇదివరకు 2014లో అహ్మదాబాద్ లోని దస్పల్లా హోటల్ లో 54 అడుగుల దోశను తయారు చేశారు. ఆదోశ రికార్డును ఇప్పుడు వీళ్లు బద్దలు కొట్టారు.

(Video Courtesy: The Times of India)

Read more RELATED
Recommended to you

Exit mobile version