డ్ర‌గ్స్ కేసులో కెల్విన్ అరెస్ట్..భారీ భ‌ద్ర‌త న‌డుమ ఈడీ కార్యాల‌యానికి త‌ర‌లింపు..!

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో కీల‌క నింధితుడు కెల్విన్ ను సీఆర్పీఎఫ్ పోలీసులు ఈడీ కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు. సినీతారల డ్రగ్స్ కేసులో కెల్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం కెల్విన్ ను భారీ బద్రత నడుమ సీఆర్పీఎఫ్ పోలీసులు బోయినపల్లి లోని కెల్విన్ ఇంటి దగ్గర నుండి ఈడీ కార్యాలయం కు తీసుకువ‌చ్చారు. నటుడు నందు, కెల్విన్ ను ఇద్దరినీ ఈడీ విచారిస్తోంది. కెల్విన్ బ్యాంక్ డాక్యుమెంట్లను ఈడీ ప‌రిశీలిస్తోంది.

సినీ ప్రముఖులతో సంబందాలు, బ్యాంక్ లావాదేవీలు పై మరోసారి కెల్విన్ ను ఈడీ విచారించ‌నుంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఈ కేసులో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాత్ ను ఈడీ విచారించింది. అంతే కాకుండా ఛార్మీకౌర్, ర‌కుల్ ప్రీత్ సింగ్ ల‌ను కూడా ఈడీ ఇప్ప‌టికే విచారించింది. మ‌రోవైపు విచార‌ణ‌కు హీరో రానా, న‌వ‌దీప్ లతో పాటు ప‌లువురు హాజ‌రుకావాల్సి ఉంది.