రాజ్యసభ స్టాండింగ్ కమిటీలో తెలంగాణకి చెందిన ముగ్గురు ఎంపీలకు కీలక పదవులు లభించాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దనకర్ అనేక కమిటీలను పునర్నిర్మించి, నూతన చైర్ పర్సన్లను నియమించారు. రాజ్యసభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం.. బిజినెస్ అడ్వైజరి, ఎథిక్స్ కమిటీలలో టిఆర్ఎస్ ఎంపీ కేశవరావు,
కమిటీ ఆన్ రూల్స్ లో బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, కమిటీ ఆన్ సబర్డినేట్ లెజిస్లేషన్లో టిఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, హౌజ్ కమిటీలో టిఆర్ఎస్ నుంచి బడుగుల లింగయ్య యాదవ్ కు స్థానం దక్కింది. టిఆర్ఎస్ నుంచి ఏకంగా ముగ్గురు ఎంపీలకు వివిధ కమిటీలలో చోటు కల్పించారు. ఇక అటు ఏపీ నుంచి.. ప్రకాష్ జవదేకర్ కు రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్, సీఎం రమేష్ కు హౌసింగ్ కమిటీ చైర్పర్సన్, బిజెపి ఎంపీ సుజిత్ కుమార్ కు రాజ్యసభ పిటిషన్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించారు.