KGF 1 :కేజిఎఫ్ 1 మూవీ రీరిలీజ్… ఎప్పుడంటే ?

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 1 చిత్రం భాషతో సంబంధం లేకుండా విడుదల అయిన అన్ని భాషల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం తెలుగులో రీరిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో యశ్ నటించిన ‘KGF 1’ రీరిలీజ్ కి సిద్ధమైంది.

ఈ నెల 27న ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.రూ.80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. అర్చన జోయిస్, వశిష్ట ఎన్ సింహ, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు.అయితే కేజీఎఫ్ 1 మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన విడుదల అయ్యింది. కాగా, కేజీఎఫ్1 సినిమా కన్నడ సినిమాల రేంజ్ ను ఊహించని స్థాయిలో పెంచిందనే సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news