KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?

-

కేజిఎఫ్ 2 శాండిల్ వుడ్ గౌరవాన్ని జాతీయస్థాయిలో తీసుకువెళ్లిన సినిమా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ పిక్చర్ తో హీరో యాష్ ఎక్కడికో వెళ్లిపోయాడు.సౌత్ స్టార్ హీరోగా నోటెడ్ అయ్యాడు.ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా సినీ జనాలను ఎదురుచూసేలా చేశారు. ఫ్రేమింగ్ నుంచి డైలాగ్స్ వరకు ప్రతీది సాలిడ్ గా సెట్ అయింది.

అందుకే శాండిల్ వుడ్ నుంచి 100కోట్ల వసూళ్ళు రాబట్టగలిగారు. అయితే ఇప్పటికే కేజిఎఫ్ 2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

సెన్సార్ బోర్డు సమాచారం ఆధారంగా కే జి ఎఫ్ 2 సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఇక రెండు గంటల 48 నిమిషాల 02 సెకండ్లు సినిమాను లాక్ చేశారు. అంటే సినిమా దాదాపు మూడు గంటల పాటు సాగుతుంది అన్నమాట. కాగా ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news