టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ… క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. క్రాక్ లాంటి భారీ హిట్ తర్వాత రవితేజ అ వరుసగా ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వం లో చేసిన ఖిలాబీ సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. ప్రస్తుతం షూటింగ్ దశ లో రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలున్నాయి.
ఈ నేపథ్యం లోనే రవితేజ కెరీర్ లో 70 వ సినిమా కు రవి తేజ సైన్ చేశాడు. ఈ సినిమాకు “టైగర్ నాగేశ్వరరావు” అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా… వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్, ప్రీ లుక్ ను ఉగాది పండుగ రోజున అంటే ఏప్రిల్ రెండో తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ అఫీషియల్ పోస్టర్ కూడా వదిలింది చిత్ర బృందం.
The date is set 🤟🏻@RaviTeja_offl's #TigerNageswaraRao Muhurtham and Pre-Look on 2nd April at 12:06 PM.@DirVamsee @abhishekofficl @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @UrsVamsiShekar @TNRTheFilm pic.twitter.com/nIWXVqcEU5
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) March 31, 2022