ట్రెండ్ ఇన్: KGF3పై డైరెక్టర్ హింట్..హర్షం వ్యక్తం చేస్తున్న సినీ అభిమానులు

-

‘కేజీఎఫ్ చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అందరికీ విదితమే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన శాండల్ వుడ్ ఫిల్మ్ ‘KGF చాప్టర్1’ ఊహించని విజయం సాధించింది. ఈ క్రమంలోనే చాప్టర్ 2పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, గురువారం చాప్టర్ 2 కూడా విడుదలైంది. ఇప్పటికే అందుతున్న రిపోర్ట్స్, ఆడియన్స్ మాటల ప్రకారం..సినిమా ఎక్సలెంట్ గా ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి హింట్ ఇచ్చేశారు. సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా ప్రధానమంత్రిగా నటిస్తున్న రవీనా టండన్ సినిమా చివరిలో ఓ పుస్తకం పేజీ తిప్పుతుండగా కేజీఎఫ్ చాప్టర్ 3 అని కనబడుతున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలోనే సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ హిట్ మూవీ మరో సీక్వెల్ ఉండటం సూపర్ అని అంటున్నారు. ఈ క్రమంలోనే #KGF3 హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేస్తున్నారు. అలా ట్వీట్స్ పెరిగిన నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో కేజీఎఫ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దాంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

KGF Chapter 2 First Look
KGF Chapter 2 First Look

 

కేజీఎఫ్ 3 లోడింగ్ అని ట్వీట్స్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ మూవీగా, హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉందని అభిమానులు అంటున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 3, చాప్టర్ 2ని మించి ఉంటుందని అంటున్నారు. రాకింగ్ స్టార్ యశ్ అలియాస్ రాఖీ భాయ్ కి జోడీగా ఇందులో శ్రీనిధి శెట్టి నటించింది. సంజయ్ దత్ ‘అధిర’గా అదరగొట్టేశారని సినిమా చూసిన అభిమానులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news