ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే లివర్ పాడైపోయినట్టే..!

-

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. నిజానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఒక్కొక్కసారి మనకు కనబడే చిన్నపాటి లక్షణాలను మనం నెగ్లెట్ చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనబడితే నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ లక్షణాలు కలిగి ఉంటే లివర్ చెడిపోయిందని మనం గ్రహించాలి.

 

నిజానికి లివర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని డైజెస్ట్ చేయడం మొదలు చెడు పదార్థాలను తొలగించడం వరకు చాలా పనులు చేస్తుంది. అయితే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా చాలా ముఖ్యం. అవయవాలకు ఏదైనా సమస్య వచ్చిందంటే నిజంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ లక్షణాలు ఉంటే లివర్ సమస్యలు ఉన్నాయని లివర్ చెడిపోయిందని మనం గ్రహించవచ్చు. అయితే లివర్ చెడిపోయిందని ఎలా మనం గ్రహించాలి..? లివర్ సమస్యలు ఉన్నట్లు మనం ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

తరచుగా పచ్చకామెర్లు రావడం:

తరచుగా పచ్చకామెర్లు వచ్చాయంటే లివర్ సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. కళ్ళు పచ్చగా అయ్యిపోతాయి. అలానే మూత్రం కూడా పసుపు రంగులో వస్తుంది కాబట్టి ఎక్కువగా పచ్చ కామెర్ల సమస్య వస్తున్నట్లయితే లివర్ ఆరోగ్యంగా లేనట్లు గుర్తించాలి.

చర్మ సమస్యలు:

ఎక్కువగా దురదలు కలిగినా, డిస్ కంఫర్ట్ గా ఉన్నా మనం లివర్ సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. అలాగే లివర్ కి సమస్య ఉంటే జీర్ణ ప్రక్రియ లో ఇబ్బందులు ఉంటాయి. ఆకలి తగ్గిపోవడం, ఆహారం తగ్గిపోవడం, కడుపు నొప్పి, వికారం వంటివి కలుగుతాయి.

గాయం త్వరగా మానకపోవడం:

ఒంటి మీద ఏమైనా గాయం కలిగితే అది మానకపోతే కూడా మనం లివర్ సమస్య ఉందని గుర్తించాలి. అలానే బ్లీడింగ్ కూడా ఒక్కోసారి ఆగదు అలాంటి సమయంలో కూడా లివర్ ఆరోగ్యంగా లేనట్లు మనం గుర్తించాలి.

మూడ్ స్వింగ్స్:

కోపం కలగడం, యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ మారిపోవడం ఇలాంటివన్నీ కలిగినప్పుడు కూడా లివర్ సమస్యలు ఉన్నట్లు గుర్తించవచ్చు. అయితే ఇలాంటి లక్షణాలు ఉంటే ఏ మాత్రము నెగ్లెట్ చేయద్దు. ముఖ్యంగా ఈ లక్షణాలు ఉంటే లివర్ పాడైనట్టు గుర్తించండి.

Read more RELATED
Recommended to you

Latest news