ఇటీవల పోలీసులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ… ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సూసైడ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాయి గణేస్ ఆత్మహత్యతో బీజేపీ కార్యకర్తలు ఖమ్మంలో తీవ్రస్థాయిలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
తాజాగా ఈ కేంద్రమంత్రి అమిత్ షా, సాయిగణేష్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. కేసుపై ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని బీజేపీ నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో మరణించిన సాయిగణేష్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ కూడా సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష రూపాయలు అందించారు. గణేష్ సూసైడ్ పై అతని అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మంత్రి పువ్వాడ అజయ్ పై కేసు నమోదు చేయాలని పొంగులేటి సుధాకర్ డిమాండ్ చేశారు. సాయి గణేష్ కుటుంబానికి అన్ని విదాల సహాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.