మోడీ ఓ చిల్లర రాజకీయ వేత్తలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. లోక్సభ ఎన్నికలు తొలి రౌండు పోలింగ్ ముగిశాక మోడీ కనిపించని ఓటర్లను చూసి భయ పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఖర్గే మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్తో ఏమీ కానప్పుడు మోడీ ఎందుకు జంకుతున్నారని అడిగారు. 2019 లోక్సభ ఎన్నికల టైం లో భారతీయులందరికీ ఖాతాల్లోకి 15 లక్షలు అందజేస్తామని మోడీ చేసిన హామీ బూటకపు హామీగానే మిగిలిపోయింది అని ఆయన గుర్తు చేశారు. రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఖర్కే అన్నారు.