రికార్డ్ స్థాయిలో ఖుషీ రీ రిలీజ్ కలెక్షన్స్ ..!

-

ఖుషి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే పవర్ స్టార్ రేంజ్ ఏంటో అర్థం అవుతుంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ సినిమాతో కూడా కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది ఈ చిత్రం. ఇకపోతే ఖుషి సినిమా వచ్చి దాదాపు 22 సంవత్సరాలవుతుంది. అయినా సరే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని మరోసారి నిరూపితం అయింది. కొత్త సినిమాకు వచ్చినట్లుగా ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. దీంతో కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అటు సినిమాలో ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన 2021లో వకీల్ సాబ్ ,2022లో భీమ్లా నాయక్ సినిమాలను మాత్రమే రిలీజ్ చేశాడు.

అయితే ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ కి సెలబ్రేట్ చేసుకోవడానికి సరైన మూమెంట్ దొరకలేదు. అందుకే తాజాగా రీ రిలీజ్ సినిమాలు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే గత ఏడాది జల్సాని మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తే అభిమానులు పండగ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఖుషి సినిమాను రీ రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేయగా ఆ హడావిడి ఇంకా ఎక్కువగా ఉంది. కొన్ని వందలసార్లు యూట్యూబ్ , టీవీలో ఈ సినిమా చూసినా సరే మళ్లీ థియేటర్కు వచ్చే సినిమాని ఎంజాయ్ చేశారు.

ఇకపోతే రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.3.62 కోట్ల వసూలు దక్కాయి. రెండో రోజు రూ. 1.52 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ.5.14 కోట్లు సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇకపోతే తెలుగు స్టేట్స్ లో తొలిరోజు కలెక్షన్స్ లో ఖుషి సినిమానే అగ్రస్థానంలో నిలబడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వసూలు తీసుకున్న సరే తొలి రోజు రూ. 4.15 కోట్లు సాధించిన ఖుషి సినిమాదే టాప్ ప్లేస్. దీన్ని బట్టి చూస్తే పవర్ స్టార్ రేంజ్ ఏంటో? ఆయన స్టార్డం ఏంటో? అభిమానులలో ఆయనకున్న అభిమానం ఎట్టిదో ? అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version