మంత్రి కేటీఆర్‌కు షాక్.. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హ్యాండిల్ పేరు మార్చి..!

-

 

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే, కేటీఆర్‌ కు కొంత మంది సైబర్‌ కేటుగాళ్లు ఝలక్‌ ఇచ్చారు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్ ను మార్చారు.

రంగంలోకి దిగిన ఐటీ శాఖ అకౌంట్ ను గంటలోనే రికవరీ చేసినట్లు తెలుస్తుంది. కాగా గత బుధవారం కేసీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కాగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేటీఆర్ గా ఉండే పేరును “కూల్ క్యాట్”గా మార్చారు హ్యాకర్లు. అయితే, ఈ విషయాన్ని వెంటనే గ్రహించిన ఐటి టీం, అప్రమత్తమై కేవలం గంటలోపే అకౌంట్ ని రికవరీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version