Kick: రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న రవితేజ కిక్ మూవీ..

-

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం‘ఈగల్’. సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటం వలన థియేటర్ల కొరత ఏర్పడటంతో పోస్ట్ పోన్ చేశారు.మేకర్స్ ను నిర్మాత మండలి కాంప్రమైజ్ చేసి సోలో రిలీజ్ డేట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ‘ఈగల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ ప్రకటించారు.దీనితో ‘ఈగల్’ మూవీ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు మరో కిక్కిచ్చే వార్త అందింది. రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ hit గా నిలిచిన ‘కిక్’ మూవీనీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది.

అయితే నిన్న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ తెలిపారు. మాస్ మహా రాజా రవితేజ కూడా ‘థ్యాంక్యూ తమ్ముళ్లూ’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఆయన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగానే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ‘కిక్’ను రీరిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.మార్చి 1న ఈ సినిమా మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ అదిరిపోతుంది.కిక్ సినిమా మరోసారి థియేటర్స్ లోకి వస్తుండటంతో అభిమానులు ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news