జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు జగన్ అని వార్నింగ్ ఇచ్చారు .ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెడనలో జరుగుతున్న రోడ్ షోలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. ‘మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు. మాలో మేమే కొట్టుకునేటట్లు చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ పాలనలోనే బాబు, లోకేశ్పై కేసులు ఎక్కువగా పెట్టారు.పోలీసుల శ్రమ దోపిడి చేసే వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడుతాడు అని అన్నారు .ఓడిపోతామన్న బాధలోనే ముఖ్యమంత్రి జగన్ కోపంతో ఉన్నారు అని అన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తాం’ అని ఆయన హెచ్చరించారు.