నోటి దుర్వాసనా..? లివర్‌, లంగ్స్‌, కిడ్నీలు వీటిలో ఏదైనా సమస్య కావొచ్చు..!

-

ఎంత తాగినా మనకు కిక్కు ఎక్కుతుంది కానీ వాసన మనకు రాదు.. పక్కనోళ్లకే వస్తుంది. నోటి దుర్వాసన కూడా అంతే. నోట్లోంచి ఎంత కంపు కొడుతున్నా ఆ విషయం మీ ఎదుటివారికే తెలుస్తుంది కానీ మీకు తెలియదు.. మరీ ఎక్కువైతే అప్పుడు అనిపిస్తుంది. అయితే నోటి దుర్వాసన అనేది చిన్న సమస్య కాదు. ఇలా వాసన వస్తుంది అంటే మీ ఆరోగ్యం గాడి తప్పిందని సంకేతం.దంతాలను, నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం అయితే ఇంకా ఎన్నో కారణాలు వల్ల నోట్లోంటి దుర్వాసన వస్తుంది. అవేంటంటే..

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. నిజానికి, ఊపిరితిత్తులలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, శ్లేష్మం అలా బయటకు రావడం ప్రారంభమవుతుంది. అది దుర్వాసనగా ఉంటుంది. దీని కారణంగా దుర్వాసన వస్తుంది.

లివర్ వ్యాధి కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. కాలేయం మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అయితే ఇది జరగనప్పుడు, రక్తంలో టాక్సిన్స్ పెరుగుతాయి. దీని కారణంగా నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది.

మీకు మూత్రపిండ వ్యాధి ఉన్నట్లయితే, ఈ స్థితిలో పొడి నోరు సమస్య ప్రారంభమవుతుంది. కిడ్నీ ఆరోగ్యం బాగున్నప్పుడు యూరియాను సులువుగా ఫిల్టర్ చేస్తుంది. కానీ కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా యూరియాను ఫిల్టర్ చేయలేక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది.

అలాగే మలబద్ధకం ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక..ఆ వేస్టేజ్‌ అంతా పైకి స్మెల్‌ రూపంలో వస్తుంది. ఈ వాసన చాలా ఘోరంగా ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే మీకే తెలుస్తుంది. మలబద్ధకాన్ని అస్సలు నెగ్లెట్‌ చేయకండి. దీని ఇంటి చిట్కాలనో లేక వైద్యులు సూచించిన మందులనో ఏదో ఒకటి వాడటం ఉత్తమం. ఏం చేయకుండా అలానే ఉంటే బాడీలో ఉండే అన్ని అవయవాల మీదనే కాకుండా మీ మానసిక ఆరోగ్యం మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version