పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడాన్ని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. అయినా సరే చాలా మంది ఇంకా పొగాకు కి అలవాటు పడిపోయి పొగ త్రాగడం నుండి బయట పడలేకపోతూ ఉంటారు. కొంతమంది స్మోకింగ్ చేయకపోయినా స్మోక్ చేసే వాళ్ళకి దగ్గరగా ఉండడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. పొగాకు మనం తాగకుండా పక్క వాళ్ళు తాగుతూ ఉంటే దాన్ని మనం పీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అని అంటారు ఎక్కువగా ఆడవాళ్ళకి పిల్లలకి ఇది అస్సలు మంచిది కాదు. సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా వచ్చే సమస్యల్లో శ్వాస సంబంధిత సమస్య ఒకటి. ఆస్తమా, న్యూమోనియా, బ్రాంకైటిస్ వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎదుగుతున్న పిల్లలకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. సెకండ్ హ్యాండ్ స్మోక్ తో లంగ్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంది. నేరుగా పొగ తీసుకోక పోయినా ఇలాంటివి కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సెకండ్ హ్యాండ్ స్మోక్ సమస్య వల్ల ప్రాణాంతకమైన సమస్యలు కూడా వస్తాయి. ఈరోజుల్లో ఎక్కువ మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు గుండె సమస్యలు సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా వస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో స్మోక్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల గర్భిణీలలో నెలలు నిండకుండా తక్కువ బరువుతో ప్రసవం అవుతుందని నిపుణులు అంటున్నారు.
సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల ఆర్థరైటిస్ సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి పెరుగుతాయి. కీళ్లవాతం కీళ్ల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్నారుల్లో కూడా ఎంతగానో ఎఫెక్ట్ పడుతుంది పిల్లల్లో శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్ చెవి ఇన్ఫెక్షన్స్ ఆస్తమా వంటివి ఎక్కువగా వస్తాయి. ఊపిరితిత్తులు సమస్యలు రావడానికి దీర్ఘకాలిక సమస్యలకి ఈ స్మోకింగ్ కారణమవుతుంది. పిల్లల్ని పొగ తాగే వారికి దూరంగా ఉంచాలి. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలు లో శ్రద్ధ తగ్గుతుంది. మతిమరుపు, ఏడిహెచ్డి వంటి సమస్యలు కూడా భవిష్యత్తులో ఎదురవుతాయి. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ప్రమాదం పిల్లలు లో పెరుగుతుంది. ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ అంటారు దీన్ని. కాబట్టి ధూమపానం చేసే వాళ్ళకి పిల్లలు దూరంగా ఉంచాలి.