మీ పిల్లలకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలా..? ట్రాన్సాక్షన్, విత్‌డ్రా లిమిట్ మొదలైన వివరాలివే..!

-

తల్లిదండ్రులే పిల్లలకి డబ్బుల గురించి చెబుతూ ఉండాలి. వారికి కూడా డబ్బుల విలువని చెప్పాలి. నిజానికి ప్రతీ తల్లిదండ్రుల బాధ్యత ఇది. అయితే మనీ వాల్యూపై పిల్లలకి అవగాహన ఉండేలా కూడా చెయ్యాలి. ఖర్చులు, పొదుపు బ్యాలెన్స్ చేసేలా చేసుకోవాలి.

వాళ్ళకి కూడా ట్రాన్సక్షన్స్ గురించి చెప్పాలి. పిల్లలకి, మైనర్లకు కూడా బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేసే సదుపాయాన్ని ఇస్తున్నాయి. మరి ఇక వాటి కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ పెహ్లా కదమ్, ఛాంప్ డిపాజిట్ అకౌంట్ వంటివి అందిస్తున్నాయి. మరి స్టేట్ బ్యాంక్ అందించే పెహ్లా కదమ్ గురించి కెనరా బ్యాంక్ ఛాంప్ డిపాజిట్ గురించి చూసేద్దాం.

ఎస్‌బీఐ పెహ్లా కదమ్:

చిన్నారులకి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ పెహ్లా కదమ్ ని ఆఫర్ చేస్తోంది.

ఎస్‌బీఐ పెహ్లా కదమ్ ని ఎందుకు తీసుకొచ్చారు..?

పిల్లలకి మనీ పొదుపు విషయంలో అవగాహన కలిపించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు.

స్టేట్ బ్యాంక్ పెహ్లా కదమ్ ఫీచర్స్:

గరిష్ట పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.
మినిమమ్ ఎంతైనా ఉండచ్చు.
స్టేట్ బ్యాంక్ చెక్ బుక్‌లను, ఫోటో ఏటీఎం కార్డులను కూడా ఇస్తోంది.
డైలీ రెండు వేలు వరకు డబ్బులను పంపచ్చు.
ఈ ఏటీఎం కార్డు ద్వారా రూ.5 వేల వరకు విత్‌డ్రా చెయ్యచ్చు.

స్టేట్ బ్యాంక్ పెహ్లా కదమ్ కి ఎవరు అర్హులు..?

10 ఏళ్లు పైబడి, 18 ఏళ్ల లోపున్న పిల్లలు ఈ స్టేట్ బ్యాంక్ పెహ్లా కదమ్ లో చేరచ్చు.

కెనరా బ్యాంకు చాంప్ డిపాజిట్ స్కీమ్:

కెనరా బ్యాంకు చాంప్ డిపాజిట్ స్కీమ్ ని అందిస్తోంది.
12 ఏళ్ల వరకు వయసున్న పిల్లల కోసం దీన్ని తీసుకొచ్చారు.
పిల్లలు మేజర్ అయిన తర్వాత ఈ అకౌంట్‌ను సేవింగ్స్ ఖాతా కింద మార్చచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news