హైదరాబాదీలను ఆకట్టుకుంటున్న కిడ్జ్‌టోపియా..

-

వేసవి వచ్చింది అంటే ఎక్కడైనా వెల్లాలని అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలకు సెలవులు రావడంతో మహా నగరాల్లో ఎక్కడకి వెళ్ళరు. అలాంటి వాళ్ళకు కొన్ని ప్రాంతాలలో వినోద కార్య క్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమాలను ఎక్కువగా చూస్తున్నారు. వేసవి సెలవుల వినోదానికి నగరంలోని ఇనార్బిట్ మాల్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇందులోని కిడ్జ్‌టోపియా చిన్నారుల కోసం సృజనాత్మక కార్యక్రమాలు, ఆహ్లాదకరమైన వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది.

వీకెండ్ వస్తే చాలు వినోద కార్యక్రమాలతో కనువిందు చేస్తోంది. జూన్ 5వ తేదీ వరకు ఈ కొనసాగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులు మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంది.సైన్స్ ల్యాబ్‌లో వినోదాత్మక ప్రయోగాలు చేయడం లేదంటే, అక్కడి వలంటీర్ల మార్గనిర్దేశకత్వంలో చెఫ్‌గా మారి వంటలు కూడా చేయొచ్చు. వీటితో పాటుగా లెగో సిటీతో సంపూర్ణ వినోదాన్ని కూడా పొందొచ్చు.

కేవలం పిల్లలకు మాత్రమే కాదు, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు.జూన్‌ 4-5 తేదీలలో మెజీషియన్‌ యోగేష్‌ అత్యద్భుతమైన మ్యాజిక్‌ ట్రిక్స్‌తో అలరించనున్నారు. వినూత్న అనుభవాలను అందించే ఈ మాల్‌ షాపింగ్‌ కోసం అత్యుత్తమ కేంద్రంగా నిలువడమే కాకుండా డైనింగ్‌, వినోదం కోసం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది..Instagram.com/inorbitcyberabadలో పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version