మ్యాగీ తెచ్చిన తంట.. విడాకులిచ్చిన భర్త..!!

-

కేవలం 2 నిమిషాల్లో వండుకుని తినగలిగే ఇన్‌స్టంట్ ఫుడ్ ‘మ్యాగీ నూడిల్స్’. చాలా మందికి ఆకలేసినప్పుడు వీటినే చేసుకుని తినేస్తుంటారు. అయితే, వీటిని అప్పుడప్పుడు మాత్రమే తింటారు. రోజూ తినాలంటే ఎవరికైనా కష్టమే. అయితే ఒక వ్యక్తికి అతడి భార్య రోజూ మ్యాగీ నూడిల్సే వండి పెట్టేది. దీంతో విసిగిపోయిన భర్త.. ఏకంగా భార్యకు విడాకులు ఇచ్చి షాకిచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

మ్యాగీ-విడాకులు

కర్ణాటకలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్ట్ జడ్జి ఎమ్.ఎల్.రఘునాథ్ ఇటీవల దేశంలో చిన్న చిన్న కారణాలతో చాలా మంది జంటలు విడాకులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తను బళ్లారి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేసినప్పుడు వచ్చిన ఒక విడాకుల కేసు గురించి వివరించారు. బళ్లారి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ.. కేసు దాఖలు చేశారన్నారు. తనకి మ్యాగీ తప్పా.. ఇంకేం వంటకం వండటానికి రాదని, అందుకే తనకు విడాకులు కావాలని పేర్కొన్నాడని తెలిపారు.

నిజానికి తన భార్యకు వంట వండటం రాదన్నారు. దీంతో రోజూ మ్యాగీ నూడిల్స్ మాత్రమే వండేదన్నారు. మూడు పూటలు మ్యాగీ మాత్రమే వండేదన్నారు. దీంతో విసిగిపోయిన భర్త విడాకులకు సిద్ధమయ్యాడన్నారు. ఈ మేరకు వారిద్దరిని కౌన్సిలింగ్ ఇప్పించినా.. ఫలితం కనిపించలేదన్నారు. ఇరువురు పరస్పర అంగీకారంతో విడిపోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version