కిలీమంజారో పర్వతాన్ని ఎక్కిన హైదరాబాద్ బుడతడు

-

ఏడేళ్ల వయస్సులో పిల్లలు టీవీ చూడటం తోటి స్నేహితులతో ఆడుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ఓ బాలుడు మాత్రం ఏకంగా ప్రపంచ రికార్డే సాధించాడు. అతడు చేసిన సాహసాన్ని చూసి అందరు ఔరా అంటున్నారు. అయితే ఇంతకీ ఆ బాలుడు ఏం సాధించాడో తెలుసుకుందామా.

boy

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విరాట్‌ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాలలో రెంతో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం విరాట్‌ పెద్దమ్మ కొడుకులు ఉత్తరాఖండ్‌లోని ఓ పర్వతం ఎక్కారు. అక్కడి నుంచి తమ్ముడు విరాట్‌కు వీడియో కాల్‌ చేసి.. అక్కడి పరిసరాలను చూపిస్తూ, విశేషాలు వివరిస్తూ మాట్లాడారు. దాంతో విరాట్‌కు కూడా పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. మొదట్లో వారు వద్దని వారించారు.

అయితే విరాట్‌ తన తల్లిదండ్రులను ఎలాగోలా పర్వతారోహణ శిక్షణకు ఒప్పించాడు. సోదరులు శిక్షణ పొందిన సంస్థలోనే విరాట్‌నూ చేర్పించారు. అక్కడ కేవలం నెలన్నర సాధనలోనే అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రతి రోజూ కచ్చితంగా శిక్షణ తరగతులకు హాజరయ్యేవాడు. కోచ్‌ పర్యవేక్షణలో నిత్యం ఆరు కిలోమీటర్ల పరుగు, యోగా చేయడం, పర్వతాలు ఎక్కడం చేస్తుండేవాడు. అయిదు కిలోమీటర్ల మారథాన్‌లోనూ విరాట్‌ పాల్గొన్నాడంట.

ఇక శిక్షణ అనంతరం మార్చి మొదటి వారంలో కిలిమంజారో పర్వతారోహణకు విరాట్‌ బయలుదేరాడు. సముద్రమట్టానికి 3,700 మీటర్ల ఎత్తు వరకు తల్లిదండ్రులు అతడి వెంట వెళ్లారు. అక్కడి నుంచి శిక్షకుడు, విరాట్‌ మాత్రమే శిఖరం దిశగా ముందుకు కదిలారు. మధ్యలో విపరీతమైన మంచు, బలమైన గాలులకు కొంత ఇబ్బంది పడినట్లు అతడు చెబుతున్నాడు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ గంటల వ్యవధిలోనే విరాట్‌ కిలిమంజారో శిఖరం చేరుకొని జాతీయ జెండాను ఎగరేశాడు. తనకు క్రికెట్‌ ఆడటం, స్కేటింగ్‌ అంటే ఇష్టమని విరాట్‌ చంద్ర చెబుతున్నాడు. ప్రతి రోజూ ఉదయాన్నే ఆరు కిలోమీటర్లు పరుగెత్తుతాడట. తర్వాత వ్యాయామంతో పాటు యోగా చేస్తాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version