ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు కిమ్ మద్దతు

-

రష్యా పర్యటనలో భాగంగా పుతిన్తో భేటీ అయిన కిమ్.. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది. ఉక్రెయిన్పై గడిచిన ఏడాదిన్నరగా రష్యా భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దీనిని ఉ.కొరియా నియంత కిమ్.. ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించినట్లు సమాచారం. తన భద్రతా ప్రయోజనాల కోసం రష్యా చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి, బేషరతు మద్దతు ఇస్తున్నానని కిమ్ పేర్కొన్నారు.

ప్రపంచ వ్యవహారాల నిపుణుల ప్రకారం ఆయుధాల బేహారీగా రష్యాకు పేరుంది ఉక్రెయిన్ పై దురాక్రమణ తర్వాత తన అమ్ముల పొదిలో ఉన్న క్షిపణులను రష్యా ఎడాపెడా వాడేసింది. ఏడాదిన్నర గడిచిపోయినప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. పైగా అమెరికా అండతో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. ఈ యుద్ధం వల్ల రష్యా పదివేలకు పైగా యుద్ద ట్యాంకులు, ఆర్టిలరీ వ్యవస్థలను కోల్పోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు యుద్ధాన్ని కనుక కొనసాగించాలి అనుకుంటే రష్యా వద్ద ఆయుధాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఆయుధాల కొనుగోలు కోసం పుతిన్ ఎదురుచూస్తున్నట్టు అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

 

ఇక కిమ్_2 హయాంలో ఉత్తరకొరియాలో అను పరీక్షలు జరపడంతో 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఆ దేశం పై ఆంక్షలు విధించింది. భద్రత మండల లో జరిగిన తీర్మానానికి అప్పట్లో రష్యా కూడా మద్దతు ఇచ్చింది. అయితే ఆంక్షలు కొనసాగుతున్న దేశాలతో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని నిబంధన ఉంది. అప్పట్లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు మద్దతు ఇచ్చిన రష్యా.. ఇప్పుడు ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుందా అనే ఉత్కంఠతో ప్రపంచ దేశాలు కిమ్_ పుతిన్ భేటీ పై సర్వత్రా ఆసక్తిగా ఉన్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం తర్వాత క్రమంగా ఆంక్షలు ఛట్రంలో ఇరుక్కుంటూ భద్రతామండలిలో అధ్యక్ష స్థానంలో మిత్ర దేశాలు ఉన్న సమయంలో విటో తో గట్టెక్కుతున్న రష్యా.. అన్నింటికీ తెగిస్తుందనడంలో అనుమానం లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయుధాల డీల్ కిమ్_ పుతిన్ భేటీ అవుతున్నారని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version