స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

-

తెలంగాణలో ఈ నెల 15న టిఎస్ టెట్-2023 జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 14న హాఫ్లైడే, పరీక్ష జరిగే 15న పూర్తిగా సెలవు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుండగా.. 2.83 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవనున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కమిషన్ గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పరీక్షకు సంబంధించి నిర్వహణ, బందోబస్తు తదితర విషయాలపై సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. స్కూల్స్ అండ్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ కూడా.. నవంబర్‌ 2, 3 తేదీల్లో పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ.. ఉత్వర్వులు జారీ చేసింది. అయితే.. ఈ పరీక్ష నిర్వహించడానికి ఎంపిక చేసిన ఎగ్జామ్ సెంటర్లలో చదివే విద్యార్థులకు మాత్రమే సెలవులు మంజూరు చేయనున్నారు. దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు పేపర్లను రోజుకు రెండు పేపర్ల చొప్పున.. రెండు రోజులు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక.. తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష ద్వారా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version