ఆర్యన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ : స్వతంత్ర సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్!

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సాక్షిగా ఉన్న కిరణ్ గోసావి పూణే పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం లక్నోలో పోలీసుల ఎదుట లొంగిపోయిన కిరణ్ గోసవి అనుమతి కోరినప్పటికీ… ఆ ప్రతిపాదనను పోలీసులు అంగీకరించలేదు.

మొత్తానికి కిరణ్ గోసవినిగురువారం అదుపులోకి తీసుకున్నట్లు పూణే పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్త స్పష్టం చేశారు. 2018 సంవత్సరంలో చీటింగ్ కేసు లో కిరణ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నాడు.

2019 సంవత్సరంలో కిరణ్ పూణే పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించారు. అయితే తే.గీ ఇటీవల ఆర్యన్ ఖాన్ తో కిరణ్ గొసవి… ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో చీటింగ్ కేసు లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నా కిరణ్ పై అక్టోబర్ 14 వ తేదీన పూణే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news