Bigg Boss 5: ‘ఆ భాద‌ను త‌ట్టుకోలేక‌పోతున్నా.. బ‌య‌ట‌కు పంప‌మ‌’ని ర‌వి రిక్వెస్ట్.. అదీ గేమింగ్ స్ట్రాట‌జేనా ?

Bigg Boss 5: బుల్లితెర ప్రేక్ష‌కులను అధ్యంతం అల‌రిస్తున్న షో బిగ్ బాస్. ఈ షో ప్రారంభం నుంచే
ఆసక్తికరంగా నడుపుతున్నారు. సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన
అంశాలతో ఈ సీజన్ భారీ స్థాయిలో రేటింగ్‌తో దూసుకపోతుంది. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్ విజ‌యవంతంగా
ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ షో నుంచి ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కూడా నామినేష‌న్స్ లోనూ, ఇటు కెప్టెన్సీ టాస్కులో భాగంగా గొడవలు బాగా జరిగింది.

దాదాపు రెండు నెలల‌ నుంచి.. కంటెస్టెంట్ల అంద‌రూ ఫ్యామిలీకి, బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఫ్యామిలీల నుంచి వచ్చిన లెటర్స్ వ‌చ్చాయి. అయితే.. బిగ్ బాస్ ఆ లెట‌ర్ ల‌ను ఉప‌యోగించి.. నామినేష‌న్స్ టాస్క్ పెట్టారు. దీంతో కొత్త మందికి వారి ఆత్మీయులు రాసిన లెట‌ర్స్ దక్కకుండా పోయాయి. ఈ క్ర‌మంలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన యాంక‌ర్ ర‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బయటకు పంపించమంటూ బిగ్ బాస్‌కు రిక్వెస్ట్ చేయడ‌మేంటీ. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు..

హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి యాంక‌ర్ రవి.. షో ప్రారంభం నుంచి.. తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్ర‌తి షోలో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. తనదైన ఆటతో బిగ్ బాస్ ల‌వ‌ర్స్ ను ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో ప‌లు గొడవలకు కార‌ణ‌మయ్యాడు. వివాదాల‌కు కేరాఫ్ గా మారాడు. ప్ర‌ధానంగా లహరి షారిని విష‌యంలో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. అలాగే, బొమ్మల ఫ్యాక్టరీ టాస్కులో రవి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆరంభం నుంచి సంపాదించు కున్న మంచి పేరుకు తూట్లు ప‌డింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ రవి.. తనను బయటకు పంపించండి అంటూ బిగ్ బాస్‌కు రిక్వెస్ట్ చేయడం అందరికీ షాకిస్తోంది.

యాంకర్ రవి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ తన మనసులోని బాధను మొత్తం బయట పెట్టుకున్నాడు.“ కొన్ని రోజులుగా మానసిక సంఘర్షణకు లోన‌వుతున్నా.. నేను ఈ షోకి డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే
న‌న్ను షో నుంచి బయటకు పంపండి. నేను బయటకి వెళ్లిపోవడానికి సిద్ధం గా ఉన్నా.. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నా’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ వ్యాఖ్యలు అనంత‌రం.. మానస్‌ రవి గురించి మాట్లాడుతూ.. రవి గేమర్‌, అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్‌ చేయాలి? అని ఆలోచిస్తూ ఉంటాడ‌ని, అలా మాట్లాడ‌టం కూడా గేమ్ లో భాగ‌మేన‌ని, రవి చాలా తెలివిగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అన్నాడు మాన‌స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
రవి వెళ్ళిపోతాడా? ఆయన కోరుతున్నట్టు ఏదైనా ఫ్యామిలీ మీటింగ్‌కు బిగ్ బాస్ ప్లాన్ చేస్తాడా…?అన‌ఏడి వేచి చూడాలి మరి..