ఇస్లాంకు క్రికెట్ కు సంబంధం ఏంటి..? ఓవైసీ ఫైర్..!

T20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ విజయంతో ఆ దేశంలోని పలువురు ప్రజాప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ మంత్రి రషీద్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా ఇతర దేశాల్లోని ముస్లింల మనోభావాలు పాకిస్తాన్ క్రికెట్ తో ముడిపడి ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా మంత్రి రషీద్ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.

ఇస్లాం కు క్రికెట్ మ్యాచ్లకు అసలు సంబంధం ఏంటని ఓవైసీ ప్రశ్నించారు. టి20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ విజయం ఇస్లాం విజయమని పొరుగు దేశపు మంత్రి చెబుతున్నాడని ఆ మంత్రి ఓ పిచ్చి వాడు కాబట్టే ఆ విధంగా ప్రేరేపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మన పెద్ద వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్ వెళ్ళకుండా ఇక్కడే ఉండి పోయారు కాబట్టి సరిపోయింది అని. లేదంటే అలాంటి పిచ్చి మంత్రులను మనం కూడా చూసి ఉండేవాళ్ళం అంటూ పాకిస్తాన్ మంత్రి పై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.