BREAKING : మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఘాటు కౌంటర్‌

-

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ ను కనుక్కున్నందుకు ప్రధాని మోదీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. కరోనా టీకా విషయంలో ప్రధాని మోదీగారు చేసిన కృషి, తీసుకున్న చొరవ భారతీయులతో పాటు యావత్ ప్రపంచానికి చాలా బాగా తెలుసని చెప్పారు.

కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రం వివిధ రంగాల్లో అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నందుకు నోబెల్ బహుమతులు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. ‘కరోనా వ్యాధి చికిత్సకు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందని అన్నందుకు వైద్యరంగంలో.. 80 వేల పుస్తకాలు చదివినందుకు సాహిత్యంలో.. అర్థం లేని అబద్ధాలను సృష్టించడంలో విచ్చలవిడిగా అవినీతి చేయడంలో’ కేసీఆర్ కు నోబెల్ బహుమతులు ఇవ్వొచ్చని ట్వీట్ చేశారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version