అవినీతి, కుటుంబ పాలన తుడిచిపెట్టుకుపోవాలి : కిషన్‌ రెడ్డి

-

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాత్ర లేకుండా తెలంగాణ లేదని, తమ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని ఆ పార్టీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన తుడిచిపెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారన్నారు. అధికారం తమదేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడాల్సిందే అన్నారు. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని కిషన్‌ రెడ్డి దుయ్యబట్టారు.

తెలంగాణలో సకల జనుల పాలన రావాలని, అది బీజేపీతోనే సాధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రేపు అదిలాబాద్ లో బహిరంగ సభ జరగనుందన్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఎంపీ, ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులా అమ్ముతున్నారన్నారు. ఎన్నికలను డబ్బుమయం చేసింది కేసీఆరే అన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. తమకు ఓటేస్తేనే దళితబంధు, పెన్షన్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version