సర్జికల్ స్ట్రైక్ పై కేసీఆర్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గర రుజువు కోరవచ్చు… కిషన్ రెడ్డి కౌంటర్

-

అభినందర్ వర్తమాన్ పరాక్రమం చాలదా…? బాలాకోట్ దాడి తరువాత 6నెలలు పాకిస్తాన్ తమ సొంత గడ్డపై ఫ్లై జోన్ నిషేధించిన విషయం తెలియాదా.. ఇవి రుజువు కాదా…కేసీఆర్ కు అనుమానం ఉంటే.. నేరుగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నే రుజువులు కోరవచ్చని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత సాయుధ బలగాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. పుల్వామా దాడి వార్షికోత్సవ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని, అజ్ఞానాన్ని తెలియజేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. గతేడాది మనల్ని కాపాడేందుకు కల్నర్ సంతోష్ బాబు, తెలుగు బిడ్డ ప్రాణాలు విడిచారని ఆయన అన్నారు. మన దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలు వదిలిన వారిని అవమాన పరచవద్దంటూ… కేసీఆర్ని కోరుతున్నానంటూ.. ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ నిన్ని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version